Tuesday, September 1, 2020

లోకల్ గా లాక్ డౌన్లు పెట్టకూడదు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ..

కన్‌మెంట్‌ జోన్లు మినహాయిస్తే స్థానికంగా ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని రాష్ట్రాలకు/ కేంద్ర ప్రాంతాలకు కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్రం పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గానీ ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని రాష్ట్రాలకు సూచించింది. ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా వ్యక్తులు, సరకు రవాణాకు అనుమతించాలని మరోసారి స్పష్టంచేసింది. దేశంలో సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4 అమలు కానుండగా.. మరిన్ని సడలింపులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది.అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు---------------------------------- సెప్టెంబర్‌ 21 నుంచి విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం. 100 మంది వరకు మాత్రమే అనుమతి 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు అనుమతి.  సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి వచ్చే నెల 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేత సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు లాంటి ప్రదేశాలకు అనుమతి లేదు. అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతి నిరాకరణ (హోంశాఖ అనుమతించినవి తప్ప)

Tuesday, December 27, 2016

రైతులకు భరోసా నిధి ఎందుకు లేదు

✍🏻 *రైతుల భరోసా నిధి ఎందుకు లేదు ?.విపత్తులకు నష్ట పరిహారం అందక ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగుతున్న రైతన్న ప్రభుత్వాలు మారినా మారని రైతుల దుస్థితి*
✍🏻భారత దేశం రైతు బాంధవ దేశం
*జై కిసాన్ అని* అన్నారు. వరదలు తుఫానులు, నకిలీ విత్తనాలు, డేట్ అయ్యిన ఎరువులు, పురుగు మందులు, సొకిన వైరస్ లు ,అధిక వ్యయం,సరైన మద్దతు ధర లేక ,గిట్టు బాటు ధర లేక చేసిన అప్పులు తీర్చ లేక పిల్లల్ని చదివించలేక పెళ్లిళ్లు చేయలేక ఏడాదికి సుమారు 20 వేల చని పోతున్నారు.
✍🏻ప్రాధమిక రంగం అని 70%మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధార పడినా దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ లేక పోవడం పాలకుల చేతగాని తనమే .
✍🏻విదేశాలలో ఏ రంగం అభివృద్ధి చెందుతుందో దానికి మరిన్ని రాయితీలు యిచ్చి ముందుకు నడిపిస్తారు.కానీ దేశం రవాణా ,ఆదాయం ,కార్మికులు,రాబడి, తిండి అన్ని ఒకే రంగం మీద ఉన్నా నిధులు సూన్యం
✍🏻మన రాష్ట్రము లో 5సంవత్సరములలో హెలిన్ ,ఫైలిన్ ,నీలం ,హుద్ హుద్, కెంప్ లాంటి బారి తుపాన్ లు వచ్చినా కేంద్ర సహాయం అని కూర్చున్నాము తప్ప రైతుకు ఇచ్చింది సూన్యం రికార్డ్స్ లో ఇస్తున్నాము అని ప్రచారం .
✍🏻సెపరేట్ బడ్జెట్ పెట్టి నిధులు ఎందుకు ఇవ్వడం లేదు. ఆర్ధిక బడ్జెట్ కాకుండా రైతు భరోసా నిధి అని కేంద్ర ఆగంతుక నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.
✍🏻విపత్తు నిర్వహణ అధికారులు రైతు పేరిట చేతి వాటం  చూపించి కోట్లు సంపాదించారు.ఇప్పటికి నష్ట పరిహారం అందక తుపాను బాధితులు ఉన్నారు రికార్డ్స్ లో ఇచ్చామని బాధితుల సొమ్ము తిన్నారు.
✍🏻రైతు భరోసా నిధి ఏర్పాటు చేయాలి ప్రత్యేక బడ్జెట్ ఉండాలి. నష్ట అంచనా అనుభవం ఉన్న టీం చేత చేయించాలి.
✍🏻నష్ట నివారణ చేసిన్నప్పుడు అధికార బలం చూపి దొంగ లెక్కలు చూపించే అధికారుల్ని తొలగించాలి.
✍🏻నష్ట పరిహారం రైతు అకౌంట్స్ లోకి మాత్రమే జమ చేయాలి.అనుభవం ఉన్న వ్యవసాయ నిపుణులు చేత అంత రించి పోతున్న వైరస్ సోకుతున్న పంటలకు మార్గదర్శికాలు వెతకాలి .
✍🏻నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చట్టం చేసి కఠినంగా శిక్షించాలి. గవెర్నమెంట్ అనుబంధ సంస్థల్లో మాత్రమే అమ్మే ఏర్పాటు చేయాలి. దీని వలన ఉద్యోగాల సృష్టి జరిగి ఉపాధి పెరుగుతుంది
✍🏻గిట్టు బాటు ధర మద్దతు ధర పంట వేయక ముందే ప్రకటించి ,ప్రతి మండలానికి ఓక రైతుమార్కెట్స్ పెట్టి షెడ్లు నిర్మించాలి.
✍🏻వరదలు సంభవించే నది పరివాహక ప్రాంతాల్లో ఆయకట్లు బలం గా తయారు  చేయాలి. నివారణ కొరకు మాoగ్రు పంటలు ఏర్పాటు చేయాలి.
✍🏻రైతు ఆత్మహత్యలు నివారించి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
✍🏻ఆదునిక ప్రపంపంచం లో ఇప్పటికైనా రైతుని అడుకోకపోతే పంటలు కొరత వచ్చి పండించే నాధుడే లేకుండా పోతాడు.
✍🏻విపత్తులు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు చేసి చేతులు దులుపుకుని మీడియా ముందు సొల్లు చెప్పి *అబద్ధపు హామీలు ఇచ్చి*రైతు నడ్డివిరిచే నాయకులకు తగిన శాస్తి తప్పదు

ఓ వ్యక్తి విమానం లో భోజనం


.విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
(Soumendra Bandopadhyay గారి పోస్టు అనువాదం)
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
                  - జైహింద్

కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గం సమావేశం

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ మెట్టింగ్ ఈ రోజు కోర్ట్ వెనుక వైపు కళ్యాణమండపం లో జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేసేరు.... వివరాల్లోకి వెళితే జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మెట్టింగ్ లను నిర్వహించి కార్యకర్తలను ఉదేశించి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు పనబాక కృష్ణయ్య,చెంచుల బాబు యాదవ్, జిల్లా ఇంచార్జ్ చాంగల్ రాయుడు, సీ వీ,శేషారెడ్డి,దేవకుమార్ రెడ్డి పాల్గునరు...వీరు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తెలియజేసారు ...అనంతరం జలదంకి మండల అధ్యక్షులు వెలమురి శివశేఖర్ రెడ్డి తమ మండలనికి సంబందించిన డైరీ ని వారిచేత ఆవిష్కరించి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది.

Shivaji statue technical highlights

This is a public information service message...Share it with everyone.!!!

Many are cribbing about the cost of the *Shivaji statue* 
What they do not know is this statue is a masterstroke by our PM  Modiwhich will pay for itself many times over.

The statue is made of Amorphous Silicon, Cadmium Telluride & Copper Indium Gallium Selenide. This is exactly the same material used to make solar cells. Our government consulted with Dr. Immonen Kirsi, Senior Solar Scientist at
VTT Research, Finland to develop technology to mould these materials into a statue form. This research took 2.5 years & on December 3rd, Dr. Kirsi sent a private email to Modi Sir that it's now ready for mainstream use. The statue will generate enough electricity to power all government offices in Mumbai.

The statue also has Radial Uniform Projection And Ranging(RUPAR) technology to track boats in the Arabian Sea to prevent a repeat of the 2008 Mumbai attack where the terrorists entered India through the sea. RUPAR is the next generation of SONAR technology and has been developed at the Indian Institute of Science.

Congratulations to   all Scientists...

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 

ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 

అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది. 

Saturday, December 24, 2016

ప్ర‌భుత్వ పాఠ‌శాలలో 8TH క్లాస్ చదివే కుర్రాడి ప్రతిభకు….గూగుల్ షాక్.!

ఆ విద్యార్థి చ‌దువుతోంది 8వ త‌ర‌గ‌తి… వ‌య‌స్సు 13 ఏళ్లు… స‌హ‌జంగా ఏ పిల్ల‌లైనా ఆ వ‌య‌స్సులో రోజంతా చ‌ద‌వ‌డం, సాయంత్రం కాసేపు ఆట‌లాడుకోవ‌డం చేస్తారు. అయితే ఆ విద్యార్థి మాత్రం అలా కాదు. రోజూ ఆడే ఆట‌లు బోర్ కొట్టాయో ఏమో గానీ తానే సొంతంగా ఆట‌ల్ని క్రియేట్ చేసేశాడు. అదీ గ్రౌండ్‌లో ఆడుకునే ఆట‌లు కాదు, ఆ పిల్లాడు క్రియేట్ చేసింది స్మార్ట్‌ఫోన్‌లో ఆడుకునే ఆట‌ల్ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. షాకింగ్ ఉన్నా ఆ పిల్లాడు చేసింది మాత్రం అద్భుత‌మే. ఇంకా హై స్కూల్ కూడా దాట‌ని విద్యార్థి ఏకంగా స్మార్ట్‌ఫోన్ గేమ్స్‌నే క్రియేట్ చేశాడంటే ఆశ్చ‌ర్య‌మే క‌దా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, కోడింగ్‌, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు త‌దిత‌ర అంశాల్లో ప‌ట్టు ఉంటే గానీ ఎవ‌రూ ఇలా చేయ‌లేరు. అలాంటి ఓ స్కూల్ విద్యార్థి చేశాడంటే నిజంగా అత‌ని ప్ర‌తిభ అమోఘ‌మనే చెప్ప‌వ‌చ్చు.

అత‌ని పేరు విష్ణుచంద‌న్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావ‌లిలో నివాసం. అత‌ని తండ్రి పేరు కొల‌ప‌ర్తి ప‌వ‌న్‌. ప‌వ‌న్ వృత్తి రీత్యాం కంప్యూట‌ర్ మెకానిక్‌. స‌ర్వీసింగ్‌లు చేయడం, సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేయ‌డం అత‌ని ప‌ని. అయితే ఇంట్లో కంప్యూట‌ర్ ఉండ‌డంతో విష్ణుకు చిన్న‌ప్ప‌టి నుంచి కంప్యూట‌ర్‌పై ఆస‌క్తి పెరిగింది. దీంతో త‌న 3వ ఏట నుంచి కంప్యూట‌ర్ల‌లో గేమ్స్ ఆడేవాడు. 5వ ఏట‌కు రాగానే 1వ త‌ర‌గ‌తిలో కంప్యూట‌ర్ల‌లో వాడే ప‌లు సాఫ్ట్‌వేర్ల గురించి ఎప్ప‌టి క‌ప్పుడు తండ్రిని అడిగి తెలుసుకునే వాడు. దీంతోపాటు ఫొటోషాప్‌, యానిమేష‌న్ వంటి గ్రాఫిక్స్ రిలేటెడ్ అప్లికేష‌న్ల‌పై కూడా త‌న 10వ ఏట‌కే అంటే 5వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే ప‌ట్టు సాధించాడు. దీంతో నిత్యం ఎక్కువ సేపు కంప్యూట‌ర్‌పైనే అత‌ను ప‌నిచేసేవాడు. రోజూ స్కూల్ నుంచి రాగానే కంప్యూట‌ర్‌తో కుస్తీ ప‌ట్టేవాడు. ఈ క్ర‌మంలో అనేక సాఫ్ట్‌వేర్ కోర్సులను సొంతంగా నేర్చుకుని వాటిపై ప‌ట్టుసాధించాడు కూడా.

అలా విష్ణు కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్ల‌పై ప్ర‌యోగాలు చేస్తూ ఇప్పుడు 8వ త‌ర‌గ‌తికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను నిత్యం ఆడుతున్న గేమ్స్ బోర్ కొట్టాయో ఏమో గానీ సొంతంగానే తానే 9 ర‌కాల ఆండ్రాయిడ్ గేమ్స్‌ను క్రియేట్ చేశాడు. క‌ల‌రింగ్‌, మ్యాచ్ మి, రంగోలి, ట్రేస్‌, షూట్ ఇట్‌, గెట్ ది టార్గెట్ వంటి ఆట‌ల‌ను విష్ణు రూపొందించి అనంత‌రం గూగుల్ ప్లే స్టోర్‌లో వాటిని పెట్టాడు. ఈ క్ర‌మంలో అత‌ని ప్ర‌తిభ గురించి తెలిసిన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ వ‌చ్చే ఏడాది మార్చి 8న కాలిఫోర్నియాలో జ‌ర‌గ‌నున్న స‌ద‌స్సుకు అత‌న్ని ఆహ్వానించింది. అంతేకాదు, అమెజాన్, శాంసంగ్ వంటి 30 ప్ర‌ముఖ కంపెనీలు అత‌నికి త‌గిన శిక్ష‌ణ ఇచ్చి మంచి ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని ముందుకు వ‌చ్చాయి కూడా. అయితే విష్ణు మాత్రం త‌న‌కు సాఫ్ట్‌వేర్ కంపెనీ యాపిల్‌లో ప‌నిచేయాల‌ని ఉంద‌ని వెల్ల‌డించాడు. అత‌ని క‌ల‌లు సాకారం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..! అన్న‌ట్టు ఇంకో విష‌యం… సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో మేథావిలా ప్ర‌తిభ చూపుతున్నాడు క‌దా అని విష్ణును ఏ కార్పొరేట్ స్కూల్‌లో చ‌దువుతున్నాడో అని భావించ‌కండి. ఎందుకంటే అత‌ను చ‌దువుతుంది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో. ఆ పాఠ‌శాల‌లో చ‌దువుతూ కూడా అంత చిన్న వ‌య‌స్సులో ఏకంగా ఆండ్రాయిడ్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేశాడంటేనే అత‌ని ప్ర‌తిభ ఏంటో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అంతటి మేథావికి పాపం అమ్మ లేదు. 3 ఏళ్ల కింద‌టే చ‌నిపోయింది. నాన్న‌, నాయ‌న‌మ్మ‌ల సంర‌క్ష‌ణ‌లో విష్ణు పెరుగుతున్నాడు. అయినా అత‌ను దిగులు చెంద‌కుండా జీవితంలో ఉన్న‌త స్థానాల‌ను సాధించాల‌ని ముందుకు దూసుకెళ్తున్నాడు. అత‌ను ఆ స్థానాల‌కు ఎద‌గాల‌ని బెస్ట్ ఆఫ్ ల‌క్ చెబుదాం..!