రాత్రి 12 దాటితే పబ్‌లు మూయాల్సిందే
అమలు దిశగా నగర పోలీసుల కార్యాచరణ
హైదరాబాద్: నగరంలో ఇక నుంచి రాత్రి 12 తర్వాత పబ్‌లను తప్పనిసరిగా మూయాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీటెక్ విద్యార్థిని కట్కూరి దేవి మృతి ఘటన జరిగిన రోజు ఆమె, భరత్ వెళ్లిన గచ్చిబౌలిలోని ‘బీట్స్ పర్ మినట్’ పబ్ రాత్రి 2.30గంటల వరకు తెరిచే ఉందని దర్యాప్తులో తేలడంతో పబ్‌ల నిర్వహణ వేళలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకే పబ్‌లు, క్లబ్‌ల్లో సంగీతం నిలిపివేయాలని, ఒంటిగంటలోపు తప్పనిసరిగా వాటిని మూయాల్సిందేనని నగర పోలీస్ చట్టంలో ఉన్న నిబంధనను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత వేళలు ముగిసిన తర్వాత నడిచే పబ్‌ల కార్యకలాపాలను వీడియో తీసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదంలో ఎవరి మృతికైనా కారకులయ్యే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిపై 304(పార్ట్-2) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు.
Sunday, May 8, 2016
రాత్రి 12 దాటితే పబ్‌లు మూయాల్సిందే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment