Friday, May 13, 2016

మళ్లీ వివాదాల్లోకి కావలి మున్సిపాలిటీ

* సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా.... మున్సిపల్ ఛైర్ పర్సన్  సీట్లో అలేఖ్య కూర్చోవడంతో.... కావలి మున్సిపాలిటీ పెనం పై నుంచి పొయ్యి లోకి పడినట్లుగా అయింది.

* మున్సిపల్ నిబంధనలు ప్రకారం....

- మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు.... అజెండా... మినిట్స్ బుక్ .... కమీషనర్ కంట్రోల్ లో ఉంటుంది.

- ఆ పుస్తకాన్ని కమీషనర్ తీసుకుని... ఇన్చార్జి ఛైర్మన్ గా ఉన్న భరత్ కుమార్ చేత... "Hand over"  అని రాసి సంతకం చేయించాలి.

- అనంతరం.... అలేఖ్య.... అదే పుస్తకం లో " Take over"...  అని రాసి సంతకం పెట్టాలి.

- అప్పుడు... అలేఖ్య... కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా భాధ్యత లు స్వీకరించినట్లుగా.... మున్సిపల్ చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది.

* కానీ.... ఈ రోజు  ( 13.05.2016 )  అలేఖ్య విషయంలో ఇవన్నీ ఏమీ జరగలేదు.

* కమీషనర్... ఆఫీస్ పని మీద హైదరాబాద్ కు వెళ్లి ఉన్నారు.  కమీషనర్......కార్యాలయానికి అందుబాటులో లేని రోజు.... కమీషనర్ పనులను... కార్యాలయంలోని మేనేజర్ చూస్తారు.

* అలేఖ్య... మున్సిపల్ కార్యాలయంలోని ఛైర్ పర్సన్ సీట్లో కూర్చున్న సమయంలో.... మేనేజర్ కూడా లేరు.

* అలేఖ్య మాత్రం... BMR Sir ( కావలి తెలుగుదేశం పార్టీ నాయకుడు )  మంత్రి నారాయణ సార్  ఆదేశాల మేరకు తాను ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరించానని... చెప్పారు.

* శని, ఆదివారం లలో... కార్యాలయానికి సెలవులు. సోమవారం నుంచి అధికారులు కార్యాలయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.  మళ్లీ తిరకాసు ఏమైనా ఉంటే... సోమవారం కూడా అధికారులు అందుబాటులో లేక పోయినా ఆశ్చర్యపడనవసరం లేదు.

* సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులలో అలేఖ్య మున్సిపల్ ఛైర్ పర్సన్ గా... భాధ్యత లు తీసుకోవచ్చని... స్పష్టంగా చెప్పలేదు.

* కానీ అలేఖ్య మాత్రం.... ఛైర్ పర్సన్ సీట్లో కూర్చొని....ఇద్దరు సార్ ల ఆదేశాల మేరకే భాధ్యత లు తీసుకున్నానని అంటున్నారు.

* కాగా.... మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్.... పరిస్థితి ఏమిటో... అర్ధం కావడం లేదు.

* అధికారులు మొహం చాటేస్తున్నరంటే..... అలేఖ్య కు కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా లేవనేది... క్లియర్ గా తెలుస్తోంది.

* ఏమైనా తేడా వస్తే.... సుప్రీంకోర్టు, హైకోర్టు ల ఉచ్చు లో చిక్కుకోవాల్సి వస్తుందని.... మున్సిపాలిటీ అధికారులు.. భీతిల్లిపోతున్నారు.

* ఇవన్నీ ఇది ఉండగా..... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.... మళ్లీ పోరాటానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

* ఒక వైపు సుప్రీంకోర్టు, హైకోర్టు లలో.... అలేఖ్య వ్యవహారం పై కోర్టు ధిక్కరణ పిటీషన్ లు దాఖలు చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

* ఈ పిటిషన్ లో... మున్సిపల్ అధికారులు ఏ విధంగా ఇరుక్కుంటారో చూడాలి.

* ఈ పిటిషన్ లు దాఖలు.... వాటిపై సుప్రీంకోర్టు, హైకోర్టు ల నుంచి... స్పందనలు.... బుధవారం కానీ, గురువారం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు... ఎలా స్పందిస్తాయో... చూడాలి.

* ఇక.... కావలి లో వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లతో మాట్లాడి..... కావలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద.... సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను... పాతర వేస్తున్న వైనం పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని.... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

* చూద్దాం ఏం జరుగుతుందో...

No comments:

Post a Comment