కావలి లో.... మున్సిపల్ ఛైర్ పర్సన్ వ్యవహారం ఉత్సహభరితంగా.... తెలుగు డైలీ సీరియల్ గా మారింది.
* గత ఐదు రోజులుగా..... సుప్రీంకోర్టు.... అలేఖ్య కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని..... రేపో మాపో..... ఆమె ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది.
* అసలు సుప్రీంకోర్టు కోర్టు ఏమి చెప్పిందంటే.....
* ఈ రగడ ను హైకోర్టు లోనే తేల్చుకోవాలని..... ఛైర్ పర్సన్ పదవి ని కోల్పోయిన అలేఖ్య కు.... ఆమె ఛైర్ పర్సన్ పదవి కి అనర్హురాలంటూ న్యాయ పోరాటం చేస్తున్న....కౌన్సిలర్ కేతిరెడ్డి శ్రీలత ( కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సతీమణి ) ఇరువురికీ స్పష్టంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
* హై కోర్టు కు కూడా.... వీళ్ల పంచాయతీ ని రెండు నెలల్లో..... ముగించాలని.... సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
* అసలు ఏమి జరిగిందంటే...
* వైకాపా నుంచి కౌన్సిలర్ గా గెలిచిన అలేఖ్య....తెలుగుదేశం పార్టీ లో చేరిన.... అలేఖ్య... కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు.
* తమ వైకాపా పార్టీ జారీ చేసిన.... విప్ ను ఉల్లంఘించిన అలేఖ్య ... ఛైర్ పర్సన్ గా అనర్హురాలంటూ..... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు.
* కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికల అధికారి అయిన కావలి ఆర్డీవో కు... అలేఖ్య పై ఫిర్యాదు చేయడం..... దీంతో ఆమె... ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం.... ఉల్లంఘనకు పాల్పడ్డారని.... నిర్ధారణకు రావడం.... అలేఖ్య ను ఛైర్ పర్సన్ గా.... అనర్హురాలంటూ ఆర్డీవో ప్రకటించారు.
* అలా.... అలేఖ్య కేవలం రెండు
నెలలు మాత్రమే.... ఛైర్ పర్సన్ గా ఉండి.... పదవిని కోల్పోయారు.
* అలేఖ్య హైకోర్టు కు వెళ్లి ఆర్డీవో తన పై వేసిన వేటుకు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
* హైకోర్టులో ని సింగిల్ జడ్జి.... ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేశారు.
* మళ్లీ అలేఖ్య ఛైర్ పర్సన్ సీటు లో కూర్చొన్నారు.
* సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.... హైకోర్టు లోనే డివిజన్ బెంచ్ లో ( ఇద్దరు జడ్జి లు ) పిటిషన్ దాఖలు చేశారు.
* డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ.... ఆర్డీవో ఉత్తర్వులను యధాతధంగా అమల్లో ఉంచమని ఆదేశాలను జారీ చేసింది.
* అలాగే...ఎన్నికల అధికారి ఆర్డీవో ను.. మళ్లీ నివేదికను అందజేయమని.... కూడా డివిజన్ బెంచ్ చెప్పింది.
* అంటే... అలేఖ్య ఛైర్ పర్సన్ గా, కౌన్సిలర్ గా రెండూ.. పదవులను కోల్పోయారు.
* మళ్లీ అలేఖ్య... డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.... సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
* సుప్రీంకోర్టు లో అలేఖ్య దాఖలు చేసిన పిటిషన్ సారాంశం ఏమిటంటే.....
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలలో.... ఆర్డీవో... నివేదిక మళ్లీ పంపే వ్యవహారాన్ని ఆపేయాలని, తన కౌన్సిలర్, ఛైర్ పర్సన్ పదవి ని తక్షణమే పునరుద్ధరించాలని... అభ్యర్ధించారు.
* అయితే సుప్రీంకోర్టు... అలేఖ్య పిటీషన్ వేయగానే.....ఒక్క కౌన్సిలర్ పదవి లో మాత్రమే కొనసాగమని చెప్పి..... ఏడాది పైగా.... వాయిదాలు వేస్తూ వచ్చింది.
* దీంతో మున్సిపాలిటీ పరిపాలన సౌలభ్యం కోసం... వైస్ చైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్..... ఇన్చార్జి ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించారు.
* తాజాగా సుప్రీంకోర్టు... ఈ వ్యవహారంపై ఒక ఉత్తర్వులు జారీ చేసింది.
* ఈ ఉత్తర్వులు అధికారికంగా రాక ముందే.... అలేఖ్య ఛైర్ పర్సన్ గా భాధ్యత లు స్వీకరిస్తారని.... తెదేపా వర్గాలు హడావుడి చేశారు.
* ఛైర్ పర్సన్ ఛాంబర్లో నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ కూడా... ఆ ఛాంబర్ ను ఖాళీ చేసి... తన వైస్ చైర్మన్ గదిలో కి ఆగమేఘాల మీద మారారు. దీంతో ఈ హడావిడి నిజమని జరిగిన ప్రచారానికి... బలం చేకూరింది.
* ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన కాపీ మున్సిపల్ అధికారులు అందుకొని... చదువుకున్నారు.
* సుప్రీంకోర్టు తాజాగా ఏమి ఆదేశాలు జారీ చేసిందంటే...
* ఈ రగడ ను రెండు నెలల్లో తేల్చేయమని.... హైకోర్టు ను ఆదేశించింది.
* అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఈ రెండు నెలలూ అమల్లో ఉంటాయని పేర్కొనింది.
* అంటే అలేఖ్య ఇప్పుడు.... కౌన్సిలర్ గా కూడా కొనసాగరన్న మాట.
* ఎన్నికల అధికారి అయిన కావలి ఆర్డీవో నుంచి కొత్తగా సమగ్రమైన నివేదికను తెప్పించుకొని... తీర్పు చెప్పాలని.... సుప్రీంకోర్టు.... హైకోర్టు కు డైరెక్షన్ ఇచ్చింది.
* సో..... మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గా గుండ్లపల్లి భరత్ కుమార్ కొనసాతారు.
* ఈ రెండు నెలలూ అలేఖ్య.... సైలెంట్ గా ఉండిపోవాలి.
* రెండు నెలలు లోగా ఆర్డీవో నివేదిక ను బేస్ చేసుకుని... హైకోర్టు..... అలేఖ్య.... ఛైర్ పర్సన్ పదవి గురించి తీర్పు ఇస్తుంది.
* హైకోర్టు ఇచ్చే తీర్పు పై.... అలేఖ్య కానీ.... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కానీ.... సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment