Wednesday, December 14, 2016

విద్యార్దిని హత్య చేసిన కేసులో నెల్లూరు జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు


నెల్లూరు న‌గ‌రంలో ఓ క‌ళాశాల విద్యార్ది ని హతమార్చిన కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం రుజువు కావడంతో ఓ విద్యార్ది సహా నలుగురు యువకులకు జిల్లా కోర్టు ఇవాళ జీవిత ఖైదు విధించింది..

న‌గ‌రంలోని కృష్ట చైతన్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న సాయికుమార్ అనే విద్యార్దికి అదే కాలేజీకి చెందిన మరో విద్యార్ది దిలిప్ కు చిన్న గొడవ జరిగింది. ఈ గొడ‌వ కాస్తా ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. దీంతో దిలీప్ సాయికుమార్ పై పగ పెంచుకున్నాడు.. ఎలాగైనా అంత‌మొందించాల‌కున్నాడు.. దీంతో తన స్నేహితులైన చంద్రగిరి అశోక్, తేజ, దిలిప్, ముంగమూరు సాయితేజారెడ్డిలకు జ‌రిగిన విష‌యం చెప్పి హ‌త‌మార్చేందుకు ప్లాన్ చేశాడు.. 2012 డిసెంబర్ 30న సాయికుమార్ కాలేజీకి వెళ్తుండగా దిలీప్, అత‌ని స్నేహితులు చంపేందుకు ప్లాన్ చేశారు.. బిఎస్ ఎన్ ఎల్ కార్యాల‌యంలో స‌మీపంలో సాయి కుమార్ ను తీవ్రంగా కొట్టి చంపారు.. సాయికుమార్ త‌ల్లిదండ్రులు ఇచ్చి న పిర్యాదు అందుకున్న 4వ ప‌ట్ట‌ణ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు.. దాదాపు రెండేళ్ల పాటుసాగిన ఈ విచార‌ణ కేసు రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తూ ఒకటవ అదనపు జడ్జి శ్యామలాదేవి తీర్పు చెప్పారు.

No comments:

Post a Comment