అనుక్షణం ప్రజల మధ్యనే ఉండే నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి...ప్రజలు తమ గోడును దీనంగా చెప్పుకుంటున్నారు. చెప్పగలిగే వారు.... చెప్పే తమ కష్టాలను శ్రద్దగా ఆలకిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.... మంచాన పడ్డ వారిని.... వారి వద్దకే వెళ్లి పలకరించి మరీ సాధక భాధలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పక్కా గృహాలు ఇవ్వలేదని, రోడ్డు లేదని, రేషన్ కార్డులు ఇవ్వలేదని, పింఛన్లు మంజూరు చేయడం లేదని... తమ గోడును దీనంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి చెబుతున్నారు. ఇవన్నీ విన్న ఆయన.... " ప్రభుత్వమే విధానమే అలా ఉందని... మరో రెండేళ్లు ఒపిక పడితే... జగన్ ముఖ్యమంత్రి అవుతారని... అప్పుడు ఇలాంటి సమస్యలు అన్నీ చిటికెలో చేస్తాను...." అని ఓదార్చుతున్నారు.
No comments:
Post a Comment