ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపియుడబ్ల్యుజే ) నెల్లూరుజిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఏర్పడింది. పలు నాటకీయ పరిణామాల మధ్య యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.సుబ్బారావు జిల్లా శాఖకు జంబో కార్యవర్గాన్ని నియమించారు. ఈ ఎన్నిక ప్రక్రియ నెల్లూరు నగరంలోని పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుండి యూనియన్ సభ్యులు హాజరయ్యారు. తొలుత యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐవి సుబ్బారావుతో పాటూ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడారు.
అనంతరం పలు నాటకీయ పరిణామాల నేపద్యంలో నూతన కార్యవర్గ ఎంపిక పూర్తయింది. ఓ దశలో ఎన్నికలు అనీవార్యం అనిపించేలా పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా అయితే ముందుగా నిర్ణయించుకున్న పేర్లతో కార్యవర్గాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే మరి కొందరు కూడా కీలకమైన పదవులను ఆశించారు. అయితే యూనియన్ లోని కొందరు నేతలు దానికి నిరాకరించడంతో వారు మరో ప్యానల్ ను సిద్ధం చేశారు. పోటా పోటీగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఎన్నికలు జరిగితే మళ్లీ కథ తారుమారవుతుందని భావించి, వారితో చర్చించి, పదవులను సర్ధుబాటు చేసి, ఎట్టకేలకు ఏకగ్రీవం చేశారు.
ఏపియుడబ్ల్యుజే నెల్లూరుజిల్లా నూతన కార్యవర్గం
గౌరవ అధ్యక్షులు – ఏ. జయప్రకాష్
అధ్యక్షులు – వల్లూరు వెంకటేశ్వర్లు ( ఆంధ్రప్రభ – బ్యూరో ఇంఛార్జ్ )
ప్రధాన కార్యదర్శి – ఎమ్.వి. చంద్రశేఖర్ ( వార్త – బ్యూరో ఇంఛార్జ్ )
ఉపాధ్యక్షులు
– ఎమ్. సుబ్రమణ్యం రెడ్డి
– కృష్ణప్రసాద్ ( ఆంధ్రజ్యోతి )
– వెంకటసుబ్బయ్య
సంయుక్త కార్యదర్శులు
– ఎన్. సుబ్బారావు
– మల్లు రాజేంద్రప్రసాద్ ( నిజమైన నేస్తం )
– ప్రేమ్ చంద్ ( ఆంధ్రప్రభ )
– ఎమ్. రత్నప్రసాద్ ( ఆంధ్రజ్యోతి )
– కే. రఘరాం
కార్యనిర్వాహక కార్యదర్శి – బండి రాజన్ ( విస్సా టివి )
కోశాధికారి – మల్లిఖార్జున్
కార్యవర్గ సభ్యులు
– షేక్ షాహుల్
– ఏ.సుధాకర్
– ఎన్.వి.నరసింహులు
– వి.వేణుగోపాల్
– పి.శ్రావణ్ కుమార్
– పి. పెంచలయ్య
– నయూమ్ ఖాన్
– ఏ. హరికృష్ణ
– రవీంద్ర చౌదరి
– కృష్ణ కిషోర్
No comments:
Post a Comment