నలుపేదో తెలుపేదో తెలియక సతమతమైన
భారతీయుడికి,
నలుపు నలుపేనని
నలుపు గంగలో తేలుతున్నదని,
చెత్తకుప్పల్లో మిగులుతున్నదని,
ఊరెనక కాలుతున్నదని తెలియచెప్పవలసిన ఓ విలేకరి,
నువ్వు కలవరపడితే
నీ కలంలోని నల్ల సిరా సిగ్గుపడింది !తెల్లబోయింది!!
ఇంతకాలం సేవ చేసిన చాకలి, మంగలి, పని మనిషిని
మనతో ప్రయాణం చేయించగలిగే అద్భుత అవకాశాన్ని
గేలి చేసి,
బిచ్చగాడినే లేకుండా చేయబోవు
రేపటి భారతం యొక్క నేటి తోలి అడుగును సింగపురం
పత్రికలు న్యూ లీ అని ప్రస్తుతిస్తే తుగ్లక్ అన్న నీ పిలుపుకు
నీ కలంలోని నల్ల సిరా సిగ్గుపడింది ! తెల్లబోయింది!
సామాన్యుడు సైనికుడిలా తలెత్తుకు క్యూ లైన్లలో
నిలబడితే,
సాటి మనిషికి సేవ చేయ నీళ్లిచ్చిన భాగ్యుడు,
ఫారం నింపించిన సహోదరుడు తనవంతు
సాయం చేసానని గర్విస్తే,
అది లోకానికి చూపక, ఆ పనీ చేయక అనిశ్చితిని కలిగించే
ఓ విలేకరి,
నీ కలంలోని నల్ల సిరా సిగ్గుపడింది ! తెల్లబోయింది!
తీవ్రవాదుల దిమ్మ తిరిగి,
కాశ్మీర్ వేర్పాటు వాదులు నడుము విరిగి,
కేజ్రీ, బెనర్జీల కి లఘుశంక పోయించిన నిర్ణయాన్ని
స్వాగతించని ఓ విలేకరి,
నీ కలంలోని నల్ల సిరా సిగ్గుపడింది ! తెల్లబోయింది!
అమ్మ తిట్టి, నాన్న తిట్టి, అన్న కొట్టి
చదివి చదివి
జాబ్ కొట్టి, ఫ్లాట్ కడితే!
పది తప్పి, రియల్ ఎస్టేట్స్ పట్టి,
కోట్లు కొట్టి, విల్లాలు కట్టి, ఖరీదైన కార్లలో షికార్లు కొట్టి,
ఎవడా ఆదర్శం అని యువతరాన్ని
అయోమయంలోకి నెట్టి,
అటకెక్కిన అర్థ వ్యవస్థను కుబేర స్థానంలో పెట్టిన
నరేంద్రుడికి ఈ రాత అంకితం!!!
No comments:
Post a Comment