Thursday, December 15, 2016

జాతీయ రహదారుల వెంట మద్యం ఫాపుల బంద్

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మద్యం వ్యాపారాలను బంద్ చేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది.జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండడంతో వాహనాలవారు వాటిని కొనుగోలు చేసి,మద్యం పుచ్చుకుని వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఈ నేఫధ్యంలో సుప్రింకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం లైసెన్స్ కాల పరిమితి వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్నందున అంతవరకు అనుమతించాలని, ఆ తర్వాత వాటిని మూసివేయాలని కోర్టు స్పష్టం చేసింది.ప్రస్తుతం ప్రతి ఐదువందల మీటర్లకు ఒక మద్యం దుకాణం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.రోడ్ల వెంబడి లిక్కర్ బానర్ లు, ప్రకటనలను తొలగించాలని కూడా సుప్రింకో్ర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment