Saturday, December 17, 2016

క్యాష్ లెస్.. లోగుట్టు ఇదీ  !

ప్రభుత్వం చెబుతున్నట్లు క్యాష్ లెస్ విధానం ఎవరికి మేలు చేస్తుంది ? దీని వల్ల ఎవరి జేబులకు చిల్లు పడుతుంది ? ఎవరి పర్సులు నిండుతున్నాయి ? ఈ విధానంలో అసలు మర్మం తెలిస్తే వామ్మో అనాల్సిందే..

ఉదాహరణకి.. ఒక వంద రూపాయల నోటు మార్కెట్‌లో వంద సార్లు సర్క్యులేట్ అయ్యింది అనుకుందాం. పోనీ మనదేం పోయిందిలే.. లక్ష సార్లు వ్యాపార లావాదేవీల్లో చేతులు మారింది అనుకుందాం. అయితే.. ఆ వంద నోటు అలా ఎన్ని సార్లు చేతులు మారినా దాని విలువ వందగానే ఉంటుంది. కనీసం పైసా కూడా పెరగదు కదా. అదే క్యాష్ లెస్ విధానంలో కార్డు ద్వారా లావాదేవీ జరిపితే.. వంద విలువతో ఓ లక్ష లావాదేవీలు జరిగాయనుకో.. సర్ ఛార్జ్ రూపంలో ప్రజల నెత్తిన పడే మొత్తం విలువ చూస్తే దిమ్మతిరగాల్సిందే...

ఎందుకంటే.. పేటీఎమ్, జియో మనీ, పేయూ మనీ, పీఓఎస్ మెషీన్ల వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా వంద రూపాయల లావాదేవీ జరిపితే దాని మీద ఆయా సంస్థలు 2.5 % కమిషన్ వసూలు చేస్తాయి. అంటే.. వంద విలువతో కూడిన లక్షల లావాదేవీలకు.. 1,00,000 * 2.5 = 2,50,000 రూపాయలు. ఈ మొత్తం అంతా ఆయా సంస్థలు, బ్యాంకుల జేబుల్లోకి వెళుతుంది. అంటే.. క్యాష్ లెస్ అంటే కస్టమర్‌ని కొట్టు.. వ్యాపార వేత్తకు పెట్టు అన్నమాట. ( నోట్ : కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై సర్ ఛార్జ్‌ని ప్రభుత్వం ఎత్తివేసినా.. కొన్ని బ్యాంకులు, వ్యాపారులు ఆ ఆదేశాన్ని పాటించడం లేదు. సేవల రుసుము ఎత్తివేత కూడా డిసెంబర్ 31 వరకే. ఆ తర్వాత ప్రతి కార్డు లావాదేవీపై తప్పనిసరిగా సర్ ఛార్జ్ కట్టాల్సిందే... ఇదీ మోడిఫికేషన్.    

ఓ ఆంగ్లపత్రిక ఆర్టికల్‌కి ఇది అనువాదం..

No comments:

Post a Comment