నెల్లూరులో మరో మహిళ అవయవదానం చేసి ఆదర్శప్రాయురాలైంది. చిట్టమూరుకు చెందిన మర్రి చెంగమ్మ అనే మహిళ ఈ నెల 12వ తేదీన బైక్ నుంచి పడి తీవ్రగాయాలపాలైంది. నెల్లూరు లోని బొల్లినేని ఆసుపత్రికి తరలించి చిరిత్స అందిస్తుండగా నిన్న బ్రైన్ డెత్ అయినట్లుగా గుర్తించారు. కుటుంబసభ్యులతో చర్చించి అవయవదానం కి ఒప్పించిన వైద్యులు ఆపరేషన్ చేశారు. గుండెను చెన్నై లోని మలార్ ఆసుపత్రికి, లివర్ ను విశాఖ అపోలో హాస్పిటల్ కు, కిడ్నీలలో ఒక్కటి తిరుపతి స్విమ్స్, మరొకటి నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి, కళ్లను నెల్లూరు మోడరన్ ఆసుపత్రికి తరించారు. అంబులెన్స్ ల ద్వారా అవయవాలను తరలించగా జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేశారు...
No comments:
Post a Comment