Thursday, February 18, 2016

గోవాలో ఇకపై 21ఏళ్లు దాటితేనే కాసినోలకు..!


పనాజీ: గోవాలో కాసినోలకు వెళ్లేవారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించనుంది. ఇందులో భాగంగానే 21ఏళ్ల పైబడిన వారిని మాత్రమే కాసినోలకు అనుమతించేలా నిబంధనలను తీసుకురానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 21ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు కాసినోలకు రావడంపై నిషేధం పడనుంది. ఈ విషయమై ఇప్పటికే షరతులతో కూడిన డ్రాఫ్ట్‌ రూల్‌ను హోంశాఖకు అందజేశారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నారు.

ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే.. కాసినోలకు వెళ్లేప్పుడు ప్రతి ఒక్కరూ వయసును తెలిపే డాక్యుమెంట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే.. భాజపా ప్రతిపాదన తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 21ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కాసినోలకు వెళ్లడాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది.

No comments:

Post a Comment