నెల్లూరు జిల్లాలో 13కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
అల్లూరు, రాపూరు, నెల్లూరు-3 ప్రతిపాదనలు
* రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెరగనున్నాయి.
* ఈప్రకారం జిల్లాలో మరో మూడు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
* ప్రస్తుతం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
* నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు నియోజకవర్గం కూడా ఉంది. ఇక ముందు దీన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలసింది.
* మరో మూడు నియోజకవర్గాలు పెంచి జిల్లాలో మొత్తం 13 ఏర్పాటు కానున్నాయి.
* రెవెన్యూ యంత్రాంగం నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభించింది.
* ఓటర్లు, జనాభా, సామాజిక వర్గాల ప్రకారం విభజన తదితర అంశాలను క్రోడీకరిస్తున్నారు.
* సగటున 1.80లక్షల ఓటర్లు ఉండే విధంగా నియోజకవర్గానికి భౌగోళిక సరిహద్దులు నిర్ణయించనున్నారు.
* నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎలా ఉండబోతాయన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కొత్త ప్రతిపాదనలు ఇవే..!
* అనధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం జిల్లాలో కొత్తగా మరో మూడు నియోజకవర్గాలు నెల్లూరు-3, అల్లూరు, రాపూరు ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
* ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో ఉన్న మండలాలు అల్లూరు, బోగోలు, దగదర్తిలను విడదీసి అల్లూరు ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.
* కావలి లోకి పక్కనే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న జలదంకి, కలిగిరి చేర్చే అవకాశాలు ఉన్నాయి.
* కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇందుకూరుపేట విడదీసి నెల్లూరు గ్రామీణం మండలంలోని జనాభాతో కలిపి నెల్లూరు-3 నియోజకవర్గాన్ని ప్రతిపాదిస్తున్నారు.
* నెల్లూరు నగరం జనాభా ఇప్పటికే 6.50లక్షలు చేరింది. దీనికి గ్రామీణ, ఇందుకూరుపేట జనాభా కలిపితే దాదాపు 7.50లక్షలు చేరుతుంది. దీంతో నెల్లూరును మూడు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన.
* ప్రస్తుతం నెల్లూరు అర్బన్, నెల్లూరు గ్రామీణం పేర్లతో నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని నెల్లూరు-1, నెల్లూరు-2గా పేర్లు మార్చే ప్రతిపాదన ఉంది.
* నగరం పరిధిలోని 54 డివిజన్లను మూడు నియోజకవర్గాలకు విభజించనున్నారు.
* నెల్లూరు-3లో తక్కువ డివిజన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తాజా ప్రతిపాదనల ప్రకారం కోవూరు లో ఉన్న ఇందుకూరుపేట మండలం నెల్లూరు-3కు రానుంది.
* కొత్తగా రాపూరు నియోజకవర్గం ఆవిర్భవించనుంది. రాపూరు, పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాలను చేర్చే ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది.
* సూళ్లూరుపేట నియోజకవర్గంలోనూ స్వల్ప మార్పులు చేసి ఒక మండలాన్ని వెంకటగిరిలో కలిపే అవకాశం ఉంది.
* పురపాలక శాఖ మంత్రి నెల్లూరు-3పై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
* ఇటీవలతెదేపాలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి రాపూరుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఆయన నాలుగు పర్యాయాలు అక్కడి నుంచి పోటీ చేశారు. రెండు సార్లు గెలిచారు.
ఈనాడు దినపత్రిక లో ప్రచురితమైన న్యూస్ ఇది.
* కొత్తగా 4 నియోజకవర్గాలు.... నెల్లూరు జిల్లా కు రావాలి.
* నాలుగవ నియోజకవర్గం పేరే.... వింజమూరు.
* నాయుడుపేట పేరుతో కొత్త నియోజకవర్గం రావాల్సి ఉంది.
* సరే... మంత్రి నారాయణ.... తన ఆసక్తి మేరకు.... నెల్లూరు 3 పేరుతో... ఒకటి, మిగిలిన నెల్లూరు ను... నెల్లూరు 1,నెల్లూరు 2 అనే పేర్లతో.... నియోజకవర్గలను రూపొందిస్తున్నారనుకోవాలి.
* ఇక ఒకటి ఎస్టీ కి రిజర్వు కావాలి.
* అలాగే ఇప్పటికే జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట లు ఎస్సీ లకు రిజర్వు అయి ఉన్నాయి.
* జిల్లా లో మరో స్థానం అంటే.... ఎస్సీ లకు మూడవ నియోజకవర్గ ను రిజర్వు చేయాలి.
ఈ అంశాలు.... గురించి కూడా ఆలోలించాల్సి ఉంది.
No comments:
Post a Comment