తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు మరో వరం ప్రకటించారు.ఆర్టిసీ బస్ లలో సీనియర్ సిటిజన్ల కు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.ముందుగా ఈ నెల ఇరవై నాలుగన చెన‌్నై నగరంలో సిటీ బస్ లలో ఈ ఉచిత సదుపాయం అమలు చేస్తారు.తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకం అమలు చేస్తామని జయలలిత తెలిపారు.నెలలో పది సార్లు ఉచితంగా సీనియర్ సిటిజన్ లు ఆర్టీసి బస్ లలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇస్తారు.ఇప్పటికే అమ్మ క్యాంటిన్లు , అమ్మ వాటర్, ఇలా అమ్మ పేరుతో పలు స్కీములు ప్రారంబించిన జయలలిత తాజాగా ఉచిత సదుపాయం ఇవ్వడం విశేషం.
No comments:
Post a Comment