అనంతపురంనకు చెందిన టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు..రెండోమూడునెలలకొకసారి అలా కన్పించి, ఇలా వెళ్లిపోతున్నారు..వారం క్రితమే వచ్చి జగన్ పై ఓ విమర్శ చేసి మళ్లీ కన్పించడం లేదని కొందరు టిడిపినేతలు వ్యాఖ్యానిస్తున్నారు..అధిష్టానంపై కాస్త అసంతృప్తితో మీడియా, పార్టీకి దూరంగా ఉన్నట్లు కేశవ్ సన్నిహితులు చెప్తున్నారు..ఇంకా మంత్రి పదవి ఇవ్వకపోవడంపైనా , కొన్ని పనుల విషయంలో ఎదురుదెబ్బ తగలడంతో దూరంగా ఉండాలని నిర్ణయించికున్నట్లు తెలుస్తోంది..చంద్రబాబుతో బాగానే ఉంటున్నా చినబాబుతో పెద్దగా సత్సంబంధాలు లేవని సమాచారం..అందుకే మనకెందుకులేనన్న ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.. కేశవ్ తో పాటు ఎన్నికల ముందు జగన్ పై మండిపడ్డ నేతలెవరూ ఇప్పుడు సీన్లో లేకపోవడం విశేషం . సోమిరెడ్డి మినహా రాజేంద్రప్రసాద్, వర్లరామయ్య, దూళిపాళ్ల, బండారు సత్యనారాయణమూర్తి, చందుసాంబశివరావు, అనురాధ, లింగారెడ్డి నోరుమెదపడం లేదని ట్రస్ట్ భవన్ వర్గాల అంచనా..వాయిస్ ఉన్నోళ్లంతా అసంతృప్తిలో ఉంటే ఎలా అని, కౌంటర్లు ఇవ్వడంలో మంత్రుల వాయిస్ పెద్దగా సరిపోవడం లేదని, వీరిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని , విషయాలు ఎవరికి చెప్పుకోవాలోనన్న సందిగ్దంలో పార్టీ వర్గాలు ఉన్నట్లు సమాచారం..
No comments:
Post a Comment