విమానం ప్రమాదం నుంచి....కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి తృటిలో తప్పిన ప్రమాదం.
* మధ్యాహ్నం 2.45 గంటలకు 'ఎయిర్ కోస్తా' విమానం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ అయింది.
* ఈ విమానం తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 3.45 గంటలకు ల్యాండింగ్ కాబోతుండగా.... విమానం ఇంజన్ లో... సాంకేతిక లోపం తలెత్తింది.
* దీంతో...పైలెట్.... అప్రమత్తమై విమానం కు లాండింగ్ సమస్య ను గుర్తించి..... . రేణిగుంట నుంచి విమానం ను తిరిగి.... హైదరాబాద్ కు తీసుకెళ్లిపోయారు
* ఈ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు.... అధికారులు... అక్కడ... ఫైర్ ఇంజన్ల ను... కూడా సిద్ధం చేశారు.
* శంషాబాద్ విమానాశ్రయంలో విమానం క్షేమంగా ల్యాండ్ అయింది.
* ఈ విమానం కు మరమ్మతులు చేసి...అదే విమానంలో ప్రయాణికులను తిరుపతి కి తీసుకెళ్తామని... సదరు విమానయాన సంస్థ సిబ్బంది చెబుతున్నారు.
* ఈ ఏపిసోడ్ లో ఆ విమానం లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా భీతిల్లిపోయారు.
* ప్రయాణికుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసా వెంకట రత్నం, తిరుపతి ఎస్పీ, దేవాదాయశాఖ కమిషనర్ తదితర ప్రముఖులు ఉన్నారు.
No comments:
Post a Comment