Thursday, February 18, 2016

ఎపిలో రెడ్డిలను పట్టించుకోని బిజెపి....

ఆంద్రప్రదేశ్ బిజెపిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అన్యాయానికి గురవుతున్నారని కొందరు నేతలు ఏకరువు పెడుతున్నారు..గతంలో ఎప్పుడో సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ అధ్యక్షపదవి దక్కిందని, ఇప్పటివరకు అలాంటి పదవేది రెడ్డి సామాజిక వర్గానికి దక్కలేదని వాపోతున్నారు.. కోస్తాలో కంటే రాయలసీమలో పార్టీ కాస్త బలంగానే ఉన్నా, ప్రభుత్వ పదవులు కాకపోయినా కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమని అంటున్నారు..ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఏదీ రాయలసీమకు కేటాయించకపోవడం ఇబ్బందికరంగా ఉందంటున్నారు., మొన్నటి ఎన్నికల్లో ఎవో రెండు సీట్లు ఇచ్చినా ఓడిపోతాయని తెలిసే కేటాయించారని అంటున్నారు..త్వరలో రాబోయే ఏపీ బిజెపి చీఫ్ పదవి కానీ లేదా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని కోరుతున్నారు..రాయలసీమకే పదవులు లేవు పైగా రెడ్డి సామాజికవర్గానికి అస్సలే పట్టించుకోవడం లేదని అంటున్నారు..విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకుపోయే నాయకుడు కూడా లేకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీకి చెందిన నేతలే చెప్తున్నారు..గుడ్డిలో మెల్ల నయమన్నట్లు మొన్నటి టిటిడి బోర్డులో భానుప్రకాష్ రెడ్డికి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే..

No comments:

Post a Comment