Thursday, February 18, 2016

ఉప రాష్ట్రపతి పదవికి నో చెప్పిన వెంకయ్య

* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కారు..... మధ్యప్రదేశ్ నుంచి ఈ సారి రాజ్యసభ కు ఎన్నిక కానున్నారు.

* వెంకయ్యనాయుడు ను ఉప రాష్ట్రపతి గా పంపే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని....రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.

* ఈ ప్రచారం గురించి వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా పెదవి విప్పలేదు.

* దీంతో ఆయన ఉప రాష్ట్రపతి అవుతారనే ప్రచారం బలపడుతున్న క్రమంలో.... స్వయంగా వెంకయ్యనాయుడు... పరోక్షంగా.... అవన్నీ ఉత్తిదే.... తాను కేంద్ర మంత్రి గానే.... కొనసాగుతానని.... చమత్కారంతో.... ఈ ప్రచారాలకు ముగింపు చెప్పారు.

* వెంకయ్యనాయుడు సతీమణి పేరు ఉష.  ఆ క్రమంలో.. తాను ఉషాపతి నే.... కాని ఉప (రాష్ట్ర) పతిని కానని.... ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

* అలాగే ఇతర పార్టీలు ఎమ్.పి పదవి ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చినా ఆయన తిరస్కరించారని కూడా సమాచారం వచ్చింది.

* మధ్యప్రదేశ్ నుంచి నాలుగోసారి వెంకయ్య నాయుడు రాజ్యసభకు ఎన్నిక కావచ్చని చెబుతున్నారు.

* ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఎమ్.పిగా ఉన్న చందన్ మిత్రా స్థానంలో వెంకయ్యకు అవకాశం రావచ్చని అంటున్నారు.

* ప్రధాని మోడీ ప్రస్తుతం వెంకయ్య నాయుడును వదలుకోవడానికి సిద్దంగా లేరని విశ్లేషణ వస్తోంది.

*బిజెపిలో సంప్రదాయానికి భిన్నంగా వెంకయ్య నాయుడుకు నాలుగో సారి రాజ్యసభ సీటు ఇవ్వడం విశేషం.

* కాగా గతంలో వెంకయ్య కు తెలంగాణ నుంచి ఎమ్.పి చేస్తామని టిఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరిగింది.

* అలాగే ఎపి నుంచి ఎమ్.పి అవడానికి కూడా అవకాశం ఉందని అనుకునేవారు.

* సో..... వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి తో క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని ఆశించిన వారికి.... ఇది చేదు వార్త.

* ముఖ్యంగా...... రాష్ట్రంలో భాజపా బలోపేతం కావడానికి.... వెంకయ్యనాయుడు చైనా వాల్ స్థాయిలో అడ్డుగా ఉన్నారనే.... ఆ క్యాడర్ ఇంతకాలం పడుతున్న మదనం.... ఇంకా.... సుదీర్ఘ కాలం.... కొనసాగనున్నదని.... రూఢీ అవుతోంది.

No comments:

Post a Comment