Saturday, February 13, 2016

మాతృత్వం మధురంగా వుండాలి: ముఖ్యమంత్రి


చిన్నారుల సంరక్షణ కోసం ఉద్యోగినులకు 60 రోజుల సెలవులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటు శిశు సంరక్షణ సెలవులు(ఛైల్డ్‌కేర్‌ లీవులు) ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒప్పంద ఉద్యోగాలను దశలవారీగా క్రమబద్ధీకరిస్తానని హామీఇచ్చారు. పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలనూ సానుభూతితో పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలతో సమానంగా శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు పట్టణాల్లోనూ అద్దె భృతి(హెచ్‌ఆర్‌ఏ)ని పెంచేందుకు అంగీకారం తెలిపారు. రెండురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర ఎన్జీవో మహాసభలను శ్రీకాకుళంలోని శివానీ ఇంజినీరింగు కళాశాలలో చంద్రబాబు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షులు అశోక్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయనమాట్లాడారు. ప్రసవం తర్వాత పిల్లలను చూసుకోవటానికి మహిళలకు రెండేళ్లపాటు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలన్న అశోక్‌బాబు అభ్యర్థనపై స్పందిస్తూ ‘‘ఉద్యోగులు సర్దుబాటు చేసుకోగలిగితే శిశు సంరక్షణ సెలవులు ఇవ్వటానికి అభ్యంతరం లేదు. తొలి దశలో మహిళలకు 60రోజుల సెలవులుమంజూరు చేస్తున్నా.(ప్రసూతి సెలవులు కాక) వీటి ఫలితాలు చూశాక తరువాత దశలవారీ పెంచుకోవచ్చు’’ అని చంద్రబాబు వెల్లడించారు.

No comments:

Post a Comment