Saturday, February 13, 2016

తెలంగాణ లో ప్ర‌తిప‌క్షాల ప‌రిస్థితి!



ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిప‌క్షాల ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా ఉంది. అధికారం లోకి వ‌స్తామా రామా అన్న విష‌యాన్ని పక్క‌న పెడితే... అస‌లు ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగానైనా ప్ర‌జ‌లు న‌మ్మె ప‌రిస్థితి లేదు. అధికార పార్టీని నిల‌దిసేది పోయి, ఉన్న కాస్త న‌మ్మ‌కాన్ని పోగొట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కాంగ్రెస్, బీజేపీ ప‌రిస్థితి అలా ఉంటే... ఒక టీడీపీ ప‌రిస్థితి దాదాపుగా తుడుచుకు పెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం జరిగిన మెద‌క్ లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గం ఉప ఎన్నిక ద‌గ్గ‌ర్నుంచి మ‌ధ్య‌లో రెండు సార్లు శాస‌న మండ‌లి ఎన్నిక‌ల కలుపుకుని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల వ‌ర‌కు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. టీడీపీ అంత‌ర్థాన‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్పడింది. నారాయ‌ణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే చేర‌డం ఖాయంగా క‌న‌బడుతోంది.  

No comments:

Post a Comment