*
* నియోజకవర్గాల పునర్విభజన లో కావలి నియోజకవర్గం షేపు మారడం ఖాయం.
* కొత్త కావలి నియోజకవర్గం బౌండరీల విషయంలో... రకరకాల ఊహాగానాలు.... ప్రచారాలు... విస్తృతంగా జరుగుతోంది.
* కొత్త కావలి నియోజకవర్గం ఆ మండలం ఉంటుంది.... ఈ మండలం ఉంటుంది... అంటూ... ప్రచారం చేసే వారు.... మీడియా ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.
* ఇలా ప్రచారం వల్ల.... అలా ప్రచారం చేసేవారికి.... ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతుంది..
* రాజకీయాలు ఎప్పుడూ కూడా.... ప్రచారాలతోనే.... బిజీగా ఉంటాయి.
* తమను అనుసరిస్తున్న వారిపై పట్టుకోల్పోకుండా.... తమ నుంచి జారిపోకుండా ఉండేందుకే... ఈ ప్రచార ఎత్తుగడలను రాజకీయ నాయకులు ఆశ్రయిస్తుంటారు.
* ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు.... రైతు రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత... ఈ రుణాలు మాఫీ విషయం లో ఆయనకు ఉన్న ఇబ్బందులు దృష్ట్యా ఏం చేశారో.... అందరికీ తెలిసిందే.
* అతెందుకు... కాపులకు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు, కాపు లను బీసీ చేస్తామని చెప్పారు.... రెండేళ్ల గాని.... ఆ సంగతి పట్టించుకోలేదు. పట్టించుకున్నా... పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం.
* నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... ఢిల్లీ లో చేరి... 'నేను మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడాను. నియోజకవర్గాల పునర్విభజన జరగదు. జరుగుతుందని.. పని లేని చంద్రబాబు... విజయవాడ లో చేరి... ఈ సారి ఎమ్మెల్యే ల సీట్లు పెరుగుతున్నాయ్... టీడీపీ లో చేరిన వారందరికీ సీట్లు ఇస్తామని... గోబుల్స్ ప్రచారం చేస్తున్నాడు' అని అన్నారు.
* కానీ... ఎవరైతే జోక్యం చేసుకుంటే... నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో... ఆయనే స్వయంగా.... అంటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు... జరుగుతుందని ప్రకటించారు.
* ఇలా రాజకీయ నాయకులు.... తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం... మంచి నీళ్లు తగినంత ఈజీ.
* సో..... ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.... రాజకీయ నాయకులు.... ఏ విషయాన్నైనా... చాలా సింపుల్ గా... జనం నిజం అనుకుని నమ్మేలా.... ప్రచారం చేయగలరు. చేయించగలరు.
* ఆ విధంగానే కావలి అసెంబ్లీ నియోజకవర్గం.... కొత్త హద్దులు విషయం లో కూడా అదే చేస్తున్నారు.
* కాని... ఎవరెన్ని ప్రచారాలు చేసినా... కొత్త కావలి నియోజకవర్గం... లో.... కావలి టౌన్, కావలి రూరల్, బోగోలు, జలదంకి మండలాలు మాత్రమే ఉంటాయి.
* ఈ కొత్త నియోజకవర్గంలో.... కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని.... అన్నీ పార్టీల్లోనూ.... విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.
* కావలి ప్రాంత ప్రజల్లో ఫ్రెండ్లీ పొలిటీషియన్ గా.... క్లీన్ ఇమేజ్ ఉన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంత మండలం జలదంకి.
* సో.... ఆయనే ఈ సారి అభ్యర్థి అయితే మాత్రం.... ప్రత్యర్ధి ... ఈ మండలంలో చుక్కలు చూడాల్సి ఉంటుంది. అంటే... వంటేరు వేణుగోపాల్ రెడ్డి.... కోసం ఆ మండల ప్రజలు.... ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
* ఇక కావలి రూరల్ మండలం లో... ప్రతి గ్రామంలో పది మందిని పేర్లు పెట్టి పిలిచే... అటాచ్ మెంట్... ఉంది వంటేరు కు.
* వంటేరు ను ఒక రాజకీయ నాయకుడు గా కాకుండా, తమ ఆత్మీయుడనే అభిప్రాయం... కావలి రూరల్ మండల ప్రజల ది.
* బోగోలు మండలం లో.... ఆయనకు విస్తృతంగా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఇక ఆయన సన్నిహితులు.... చాప కింద నీరులా.... పకడ్బందీగా.... వంటేరు కు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఏర్పరచడానికి...... ప్రతి పంచాయతీ లో స్ట్రాంగ్ మాస్టర్ ప్లాన్ లు వేసి ఉన్నారు.
* మిగిలింది కావలి పట్టణం. అభివృద్ధి విషయంలో పటిష్టమైన విజన్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి సొంతం అనే ఇమేజ్... కావలి టౌన్ ప్రజల్లో ఉంది.
* కావలి డెవలప్ మెంట్ ట్రెండ్ సెట్టర్ వంటేరు తో స్వతంత్రంగా మువ్ కావచ్చని..... అందరితో ఫ్రీ గా కలిసిపోయే వ్యక్తిత్వం వంటేరు ప్రత్యేకత అనేది... కావలి పట్టణ ప్రజల్లో ఉన్న బలమైన అభిప్రాయం.
* కావలి లో పార్టీలకు అతీతంగా క్యాడర్ వంటేరు వేణుగోపాల్ రెడ్డి... ఈ సారి కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంపై సానుకూలంగా చర్చించుకుంటున్నారు.
* ఆయన మాత్రం.... భవిష్యత్తు రాజకీయాలు గురించి.... ఒక్క మాట కూడా చెప్పడం లేదు.
* ఏది ఏమైనా.... ఈ సారి కావలి నియోజకవర్గం లో వంటేరు వేణుగోపాల్ రెడ్డి .... కీలకమైన పాత్ర పోషించడం ఖాయం.
* అయితే ఆ కీలకమైన పాత్ర స్వభావం ఎలా ఉంటుంది...? వంటేరు వేణుగోపాల్ రెడ్డి... వ్యక్తిగతంగా తీసుకోబోయే చొరవ... తదితర అంశాలు గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
* అప్పుడెప్పుడో.... అంటే.. 12 ఏళ్ల క్రితం.... ..( 2004 సంవత్సరం)..... ముందు రాజకీయంగా.... పదేళ్ల పాటు అంటే.... 1994 - 2004 కాలంలో... కావలి ప్రాంత ప్రజలతో వంటేరు వేణుగోపాల్ రెడ్డి మమేకమైన తీరు ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
* రాజకీయంగా 12 ఏళ్ల తర్వాత.... ఇప్పుడు కూడా.. ఆయన '' తిరుగులేని రాజకీయ శక్తి '' గా ప్రజల మనస్సుల్లో ఉన్నారంటేనే.... వంటేరు... మంచితనం ఏమిటో చెప్పకనే చెబుతుంది.
No comments:
Post a Comment