Thursday, February 18, 2016

కెసిఆర్ ప్రకటనను ఖండించిన ఎపి కలెక్టర్ ........

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఒక ప్రకటనను ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించకుండా, ఒక జిల్లా కలెక్టర్ తో ఖండింప చేయడం విశేషంగా ఉంది.పోలవరం ప్రాజెక్టు పనులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ,ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని మండలాలను ఎపిలో విలీనం చేశారు.దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.అయితే చంద్రబాబు నాయుడు అలా గ్రామాల విలీనం తమ ఘనతగా ప్రచారం చేసుకుంటారు. కాని తాజాగా కెసిఆర్ ఒక ప్రకటన చేస్తూ ఎపిలో కలిసిన ఏడు మండలాలలోని గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని , త్వరలోనే జరుగుతుందని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే ఉత్కంఠ రేకెత్తించింది. కాని దీనిని ఫశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఖండించారు.కెసిఆర్ ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడారో తమకు తెలియదని, పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం అయిన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.అలాంటి ప్రతిపాదనలను తాము పంపించలేదని ఆయన అన్నారు ఇంకా బూర్గంపహాడ్ మండలం నుంచి మరో నాలుగు గ్రామాలు ఎపికి రావల్సి ఉందని, వాటి విషయమై సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.మరి ఇంతకీ కెసిఆర్ ఎందుకు ఆ ప్రకటన చేశారు?చంద్రబాబు వద్ద ప్రస్తావించకుండా, ఆయన అంగీకరించకుండా కెసిఆర్ ఇలా ఎలా అంటారు?ఏమో ,ఏమి జరిగిందో!

No comments:

Post a Comment