Saturday, February 13, 2016

రామయపట్నం పోర్ట్ సాధనకోసం త్వరలో ఉద్యమం: మాజీ MLA వంటేరు


కావలి కనకపట్నం కావడానికి వున్న పెద్ద అవకాశం రామయపట్నం పోర్ట్. రామాయపట్నంలో పోర్టుకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలూ వున్నా కూడా ఈరోజు కొంతమంది పెద్దలు దానిని గూడూరు దగ్గరలోని దుగారాజపట్నంలో నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే నెల్లూరు, ఒంగోలు మద్యలో పరిశ్రమలు స్థాపించడానికి అనువయిన భూములు వున్నా కూడా కంటితుడుపుగా పరిశ్రమలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన పోర్ట్ కోసం నక్కపల్లి(విశాఖపట్నం), దుగారాజపట్నం(గూడూరు), రామయపట్నం(కావలి) లలో కేంద్ర టెక్నికల్ కమిటీ పరిశీలన జరిపి మూడింటిలో రామయపట్నం అత్యంత అనుకూలము, ఉపయోగకరము అని నివేదిక ఇచ్చినది. రామాయపట్నంతోపాటు పరిశీలన చేసిన వెస్ట్ బెంగాల్ లోని సాగర్ పోర్టు ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకుంది, కాని ఎన్నికల ప్రయోజనం కోసం అప్పటి తిరుపతి యం.పి చింత మోహన్ హడావిడి చేసి 60 మంది యం.పిలతో సంతకాలు పెట్టించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని తప్పుదారి పట్టించి దుగారాజపట్నం పోర్టుకు అనుమతులు తెచ్చారు. రామయపట్నం పోర్టు ఏర్పాటు చేయకపోతే ప్రకాశం, నెల్లూరు జిల్లాల యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది కాబట్టి యువతరాన్ని,మేధావులను  కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమాన్ని చేసి పోర్టును సాధిస్తాము అని కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు

No comments:

Post a Comment