ఫిబ్రవరి 9 సాయంత్రం..
దేశం కోసం సియాచిన్ లో పెట్రోలింగ్ చేస్తూ.. మంచు తుపాన్ కారణంగా 25 అడుగుల లోతుమంచులో కూరుకుపోయిన వీర సైనికుడు హనుమంతప్ప ప్రాణాలతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో పోరాడుతున్నాడు..
సరిగ్గా.. అదే రోజు రాత్రి.. ఢిల్లీలోని ఆర్‌ఆర్ హాస్పిటల్‌కు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న జేఎన్‌యూ క్యాంపస్‌లో లెఫ్టిస్టి విద్యార్థులు.. ఇంకా, చెప్పాలంటే.. డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు ఎంత ఘోరమైన అకృత్యానికి పాల్పడ్డారో తెలుసా? మన దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ పై దాడి చేసిన ఘటనలో కీలక సూత్రధారి టెర్రరిస్ట్ అఫ్జల్ గురును వీరుడి అభివర్ణిస్తూ.. స్వాతంత్ర్యం వచ్చిన కాలం నాటి భారత్‌పై ప్రచ్ఛన యుద్ధం (Proxy war) చేస్తూ.. అనేక వేల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ ను అనుకూలంగా గట్టిగా.. గట్టిగా
నినాదాలు చేశారు. వీరు హిందీలో చేసిన నినాదాలు తెలుగులో..
* ‘అమరవీరుడా అఫ్జల్ గురు.. నీ ఆశయాన్ని నెరవేరుస్తాం.. భారత్ ను నాశనం చేస్తాం’
* ‘ఇండియాను నాశనం చేసేవరకు.. నీ తరపున మేం యుద్ధం కొనసాగిస్తాం’
* ‘పాకిస్థాన్ జిందాబాద్, పాకిస్థా్న్ జిందాబాద్..
* ‘ఇండియా గో బ్యాక్’
* ‘జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర్యం ఇవాల్సిసిందే’
*’మీరు ఎంతమందిని ఉరి తీస్తారు.. ఇంటి కొక అప్జల్ గురు వస్తాడు’
* భారత్ ను నాశనం చేసే వరకు మా యుద్ధం కొనసాగుతుంది’
ఈ స్లోగన్స్ విని..వీరు పాకిస్థాన్ విద్యార్థులు అనుకోకండి. అక్షరాలా మన దేశంలో పుట్టి.. మన దేశంలో పెరిగి.. మన దేశపు గాలి పీలుస్తూ.. మన
దేశపు ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా.. సబ్సిడీ ద్వారా ఉన్నత చదువులు చదుకుని.. ప్రస్తుతం ఢిల్లీ జేఎన్‌యూ యూనివర్సిటీలో నెలకు 30,000 నుంచి 40,000 వరకు భారత ప్రభుత్వం ఫెలోషిప్ లు పొందుతున్న రీసెర్చి స్కాలర్ విద్యార్థులు!
ఫిబ్రవరి 9న అప్జల్ మరణానికి తెగ బాధపడిపోతూ.. తాము ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమానికి తరలిరావాలంటూ ఓ పాంప్లెట్ ను
జేఎన్‌యూ లెఫ్టిస్ట్ విద్యార్థులు ప్రింట్ చేశారు.. ఈ ప్లాంప్లెట్ ఏముందో తెలుసా? అఫ్జల్ గురును అన్యాయంగా మన దేశంలోని న్యాయవ్యవస్థ ఉరి
తీసిందట! కరెక్ట్‌గా చెప్పాలంటే..’Judicial killing’ కు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు పాల్పడిందట. అదే విధంగా, ఇదే ప్లాంప్లెట్‌లో మన దేశాన్ని ‘ది కంట్రీ విత్ అవుట్ ఏ పోస్ట్ ఆఫీస్’ గా అభివర్ణిస్తూ ప్రచురించిన పాంప్లెట్ చూడండి. ఇక్కడ ‘ది కంట్రీ విత్ అవుట్ పోస్ట్ ఆఫీస్’ అంటే అర్థం మన దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు మనం బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదట! ఇదంతా చదివిన తర్వాత మీకు అర్థమయ్యింది! మన దేశంలో ఉంటూ.. మన దేశపు తిండి తింటూ.. మన దేశంలో అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్న పాకిస్థాన్‌ను.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మద్దతిస్తున్న ఈ విద్యార్థులు అసలు మనుషులేనా? అరే.. పాకిస్థాన్ మీద.. యాకుబ్ మెమెన్.. అఫ్జల్ గురు లాంటి వారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్న వీళ్లు.. మరి వీరి అరాచకాల కారణంగా.. వందలాది మంది భారతీయులు మీద చనిపోయారన్న స్పృహ ఏమాత్రం వీళ్లకు ఉందా! అసలు.. ఈ రకంగా ఆలోచించి.. వీళ్లు పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు, ఉగ్రదాడులు సూత్రధారులకు మద్దతిస్తున్నారు అంతుపట్టడం లేదు! పైగా.. వీళ్లంతా ఏమైనా తక్కువ చదువుకున్నారు.. లోకజ్ఞానం లేదు.. నిరక్షరాస్యలు అనుకుందామో అంటే.. గాడిదల్లాగా ఒక్కొక్కడు పీహెచ్‌డీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లు చేస్తున్నారు! ఒక్క జేఎన్‌యూలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న చాలా యూనివర్సిటిల్లో లెఫ్టిస్ట్ విద్యార్థి సంఘాలు ఇంత నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు.
అరే.. రోజూ పిడికెడు అన్నం పెడితే.. కుక్క జీవితాంతం విశ్వాసంగా ఉంటుందే! మరి.. దేశానికి భవిష్యత్తులో దిశానిర్దేశం చేస్తారని.. దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి దిక్సూచిలు అవుతారని.. దేశ అర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రతీ ఏటా కొన్ని వేల కోట్లు యూనివర్సిటీల కోసం.. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే.. వీళ్లమో దేశానికి విశ్వాసంగా ఉండకుండా.. దేశంపై విషం కక్కుతున్నారు. ఇంతటి దేశ ద్రోహులని మనం ఏం
చేయాలి.
ఓ ఉదాహరణ చెప్పుకుందాం! ఒసామా బిన్ లాడెన్‌ను వీరుడిగా అభివర్ణిస్తూ.. అమెరికాలోని యూనివర్సిటీలో విద్యార్థులు కార్యక్రమం నిర్వహిస్తే.. ఆ దేశం ఊరుకుంటుందా?ప్రాన్స్ లో ఐఎస్‌ఐఎస్ గ్రేట్ అంటూ ఆ దేశ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తే ప్రాన్స్ ప్రభుత్వం ఊరుకుంటుందా?ఏ దేశమైనా.. తన దేశంలో ఉంటున్న ప్రజలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రపంచంలో ఏ దేశం ఊరుకోదు.. ఒక్క ‘ది గ్రేట్ ఇండియా’ తప్ప.
ఎందుకుంటే మనలో అతిమంచితనం ఎక్కువ! తప్పు చేసిన వాడిని శిక్షించడానికి వంద రకాలుగా ఆలోచిస్తాం? ఇక, మన రాజకీయ నాయకులకు మన దేశ ప్రయోజనాలే కంటే.. వారి..వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం! తప్పు చేసిన వాడిని శిక్షిస్తే.. రాబోయే ఎలక్షన్లలో తమకు ఓట్లు ఎక్కడైనా తగ్గుతాయోమోనన్న మన దేశంలోని రాజకీయ పార్టీల్లో బాగా మెండు! అందుకే, ఈ విద్యార్థులు ఇంత దారుణంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. మన దేశాన్ని నాశనం చేస్తామని ఢిల్లీ నడిబొడ్డులో ఎలుగెత్తి ప్రకటించినా.. మన సర్కార్ లో కదలిక లేదు. జస్ట్.. ఈ విద్యార్థుల మీద ఓ ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసి అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపేసుకున్నారు. తదనంతరం విద్యార్థుల భవిష్యత్ పాడైపోకూడదన్న జాలితో కొన్ని రోజులు జైళ్లో పెట్టి నామ్‌కా వాస్ వీరిని హెచ్చరించి వదిలేస్తారు. ఈ విధంగా చేయడం.. దేశ స్వాతంత్యం వచ్చిన కాడి నుంచి మన దేశంలో జరుగుతున్న రొటీన్ ట్రెండ్! ఇప్పటి కైనా దేశాన్ని నాశనం చేస్తామని నినాదాలు చేసిన ఈ సైకోలను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అసలు ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఈ వెధవలను జైళ్లలో వేసి కుళ్లబొడవాలి! ఇంకా చెప్పాలంటే, మూలాల్లోకి ఇలాంటి దేశ వ్యతిరేక భావజాలాన్ని విద్యార్థుల్లో నింపుతున్న కుహనామేథావుల పనిపట్టాలి!
మీరు ఓ రైతు! మీకు పచ్చని పొంట పొలం ఉంది.. దాన్లో ఈ ఏడాది ఓ మంచి పంటను వేశారు. అయితే, పొలంలో ఏ కారణం వల్లనో కలుపు మొక్కలు పుట్టాయి. అప్పడు మీ పంట బాగా ఎదగాలంటే ఏం చేయాలి.. కలుపు మొక్కలను వెంటనే పీకిపారేయాలి. వెంటనే పీకకుండా ఆ కలుపు మొక్కలను పీకపోతే.. ఆ దరిద్రపు మొక్కలను మిగతా పంటను నాశనం చేస్తాయి. ఇదే, ఉదాహరణ దేశానికి కూడా అప్లై అవుతుంది. దేశ
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. దేశ ద్రోహులుగా మారిన కలుపుమొక్కల్లాంటి విద్యార్థులను మీరు శక్షించకపోతే.. వీళ్లు తర్వాతర్వాత మంచి మొక్కలను కూడా కలుపు మొక్కలు చేసేసి దేశ విద్రోహ శక్తులుగా మార్చేస్తారు. అందుకే, మన దేశ ప్రభుత్వం ఇప్పటి కైనా ఇలాంటి వాళ్లపై కఠిన వైఖరి అవలంభించాలి.. లేకపోతే ఈ కలుపు మొక్కల కారణంగా దేశం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ మాట కాస్త అతిశయోక్తి గా ఉన్నా.. మన ప్రస్తుత సమాజంలో పాజిటివ్ విషయాల కన్నా నెగటివ్ విషయాలపై విద్యార్థులు ఎక్కవ ప్రభావితమవుతున్నారు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో విషయం.. దేశ ద్రోహానికి పాల్పడే వాడు ఓసీ అయినా, ఓబీసీలైనా.. ఎస్సీ, ఎస్టీలకైనా.. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా వాడు దేశ ద్రోహి క్రిందే లెక్క! దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినవాడే తమ కులం వాడు లేదా తమ మతం వాడు లేదా తమ మత వర్గం చెందినవాడైతే.. అతడిని నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చే కొత్త ట్రెండ్ మన దేశంలో ఇటీవల మొదలైంది! అందుకే, దేశంలో సదరు కల పెద్దలకు, మత పెద్దలకు నా విన్నపం ఒకటే! పాము ఎప్పటికీ పామే.. అది నీ ఇంట్లో పామైనా పామే! పరాయి ఇంట్లో పామైనా పామే! నీ ఇంట్లో పాము కదా నువ్వు ఈ రోజు వెనకేసుకొస్తే.. రేపనే రోజున అది నిన్ను కచ్చితంగా కాటు వేస్తుంది.
అందుకే, మనుషుల సంకరం ద్వారా కాకుండా పిశాచాల సంకరం ద్వారా పుట్టిన ఇలాంటి దేశ ద్రోహులను ఇకనైనా మన ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి!
Thursday, February 18, 2016
దేశ భక్తుల ఆవేదన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment