హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో చేదు అనుభవం నేపధ్యంలో వచ్చే ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై తెలంగాణ బిజెపి నేతలు చర్చించారు.గ్రేటర్ లో ఎదురైన అనుభవాన్ని కూడా సమీక్షించారు.ఈ సందర్భంగా టిడిపితో పొత్తు వదలుకోవడం బెటర్ అని పలువురు బిజెపి నేతలు అబిప్రాయపడ్డారు.ఓటుకు నోటు కేసు, ఆ తర్వాత పరిణామాలలో టిడిపితో పొత్తు వల్ల బిజెపికి నష్టం జరిగిందని వారు భావించారు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో టిడిపితో పొత్తు వద్దని బిజపి నేతలు భావిస్తున్నారని చెప్పారు.అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడి నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment