తెలంగాణ బిజెపిలో మంత్రిపదవుల కోసం పోటీ పడుతున్నట్లు కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..త్వరలో టీఆర్ఎస్ తో సయోధ్య కుదురుతుందని, కేంద్రంలో టీఆర్ఎస్, తెలంగాణ కేబినేట్ లో బిజెపి చేరుతుందని కథనాలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు( రాజాసింగ్ పార్టీకి దూరం) ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం..ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది..త్వరలో కిషన్ రెడ్డి పదవీ కాలం అధ్యక్ష పదవిీకాలం ముగుస్తుండటంతో ఆస్థానంలో లక్ష్మణ్ లేదా చింతలను తీసుకోవాలని అధిష్టానం సూచించినా వద్దంటున్నారట..త్వరలో కేబినేట్ చేరుతున్నందున కుట్రపూరితంగా అధ్యక్ష పదవి ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారట..కిషన్ రెడ్డి అయితే ఏకంగా టిడిపితో పొద్దు లేకుండా నేరుగా టీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వంలో కలిసిపోదామని భావిస్తున్నారని అదే పార్టీకి చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు..బ్రాహ్మణ కోటాలో తమకే అవకాశమివ్వాలని ప్రభాకర్, రామచంద్రరావు ప్రయత్నాలు..అందుకే ప్రభాకర్ కేసీఆర్ యాగానికి మూడురోజుల పాటు వెళ్లారని అంటున్నారు..కిషన్ రెడ్డికి కేంద్రంలో ఇచ్చి రాష్ట్రంలో తనకే అవకాశమివ్వాలని చింతల పట్టుబట్టే అవకాశముందని సమాచారం..ఏదైనా ఇంకా ప్రెండ్షిప్పే కుదరలేదు..అప్పుడే పంచుకున్న వైనం చూస్తుంటే ఏదో సామెత గుర్తు వస్తున్నట్లుంది..
No comments:
Post a Comment