Friday, February 12, 2016

కావలిలో వంటేరు మరోప్రస్థానం

కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి..... శనివారం నుంచి మరో ప్రస్థానం కు శ్రీకారం

* కావలి లో అధికార పార్టీ నాయకుడిగా  ( 1994 - 1999 ),  కావలి ఎమ్మెల్యే గా  ( 1999 - 2004 )  వంటేరు వేణుగోపాల్ రెడ్డి.... కావలి లో ప్రగతికి పరుగులు తీయించారు.

* అందుకే కావలి ప్రాంత ప్రజల మనో శిలాఫలకం పై వంటేరు కు శాశ్వత స్థానం దక్కింది

* రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు అవసరమో.... వారిని కాకాలు పట్టడం, భజనలు చేయడం .... బాగా తెలిసిన వారు మాత్రమే రాణిస్తున్న కలికాలం ఇది.

* ఓపెన్ మైండ్ తో.... నిజాయితీగా ఉంటే 'వంటేరు' కు ఇలాంటి టక్కు టమారాలు తెలియవు. అబ్బలేదు కూడా.

*   ఏ రంగంలోని వారైనా... మంచితనం నమ్ముకుంటే... సమస్యలు ఎదుర్కోక తప్పదు. అలాగే వంటేరు కూడా రాజకీయంగా కాస్త... వెనుకబడ్డారు.

* కాని ఆలస్యమైనా.... నిజాయితీ,  మంచితనానికే.... చరిత్రలో చోటు ఉంటుంది. అందుకే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పట్ల కావలి ప్రాంత ప్రజల్లో... గౌరవం.

* కాగా.... వంటేరు వేణుగోపాల్ రెడ్డి  కావలి లోని నమస్కార్ హోటల్ లో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు.

* ఈ ప్రెస్ మీట్ లో.... వంటేరు వేణుగోపాల్ రెడ్డి....

- ఏ విషయాలు గురించి..... మాట్లాడుతున్నారు....?

- రాజకీయాలు గురించి ఏమైనా సంచలన విషయాలు ప్రకటించతారా...?

-  జనాలకు ఉపయోగపడే విషయాల పై తన విజన్ ని... ఆవిష్కరిస్తారా....?

- కావలి లో ఉన్న రాజకీయ నాయకులు పొద్దస్తమానం చెప్పే అంశాలే.... చెబుతారా  ? 

- లేక తన ' వంటేరు ' బ్రాండ్ ఇమేజ్ కు ఉన్న రేంజ్ లో.... ఆసక్తికరమైన మేటర్ ఉంటుందా....? 

- వంటేరు వేణుగోపాల్ రెడ్డి శనివారం కావలిలో ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో ఏమి చెబుతారో కానీ.... కావలి రాజకీయాల్లో.... మరో చారిత్రాత్మకమైన ఘట్టానికి.... శ్రీకారం జరగడం ఖాయమనే వాతావరణం క్లియర్ గా అర్థమౌతుంది.

No comments:

Post a Comment