Thursday, February 18, 2016

కావలి మున్సిపాలిటీలో వైకాపా పెత్తనం

కావలి మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ ను దూరం చేసుకుంటున్న తెదేపా నాయకత్వం.

* అణచివేత ఎక్కువ అయిన చోటే... తిరుగుబాటు వస్తోంది.  కావలి ఇన్ఛార్జి ఛైర్మన్ భరత్ కుమార్ విషయంలో..... కావలి తెదేపా నాయకత్వం... అదే ఎదుర్కొంటోంది.

* భరత్ కుమార్ మాటల్లోనే చెప్పాలంటే ' నేను వేలిముద్రోడ్ని కాదు.  తెర వెనుక ఉండి.... మున్సిపాలిటీ అధికారుల చేత నన్ను అవమానాలు చేస్తున్నారు. ఏం చేయాలో నాకూ తెలుసు...' అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

* ఆత్మాభిమానం దెబ్బతింటే.... ఎవరైనా ఇలానే మాట్లాడుతారు. 

* ఇంత జరిగినా కావలి తెదేపా నాయకత్వం.... నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆలోచించక పోగా.... భరత్ కుమార్ విషయంలో.... రాజీ ప్రసక్తే లేదన్నట్లుగా మొండి పట్టుదల కు పోతోందనే విషయం క్లియర్ గా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

* తెదేపా నాయకుడు బీదా మస్తాన్ రావు తో విభేదాలు బహిర్గతం అయ్యే వరకు కూడా.... కావలి మున్సిపాలిటీ లో వైకాపా పాత్ర.... ఏమీ లేదు.

* భరత్ కుమార్ తో మస్తాన్ రావు కు విభేదాలు రావడంతో..... వైకాపా కు చెందిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ కి చెందిన కౌన్సిలర్లు... ఆయనకు దగ్గరయ్యారు.

* ఇక తెదేపా నాయకత్వం... భరత్ కుమార్ ను....ఇన్చార్జి ఛైర్మన్ సీటుకు శాశ్వతంగా దూరం చేసే.... పొలిటికల్ ప్రాజెక్టు ను Take up చేసింది.  ప్రస్తుతం ఆ పనిలో తలమునకలై ఉంది.

* భరత్ కుమార్ కూడా ఎక్కడా... మెత్త పడకుండా....తనతో సన్నిహితంగా ఉంటున్న వైకాపా కు దగ్గర అవుతున్నారు.

* వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,  కౌన్సిలర్లు లతో కలిసి కావలి పట్టణంలో పర్యటన చేస్తున్నారు.

* రెండేళ్ల కు.... వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కావలి మున్సిపాలిటీ కార్యాలయం లో... ఇన్చార్జి ఛైర్మన్ భరత్ కుమార్, కమీషనర్, ఇతర అధికారులతో ఏకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

* అంటే... తెదేపా నాయకత్వం దూరమైనా.... ఇన్చార్జి ఛైర్మన్ గా తనను గౌరవించే వారికి... తాను గౌరవిస్తానని... భరత్ కుమార్.... చెప్పకనే చెప్పినట్లు అయింది.

* ఈ పరిణామాలు.... రాజకీయంగా వైకాపా కు లబ్ది పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

* తెదేపా క్యాడర్ మాత్రం.... జరుగుతున్న ఈ వ్యవహారాల పట్ల కలత చెందుతోంది.

* కావలి మున్సిపాలిటీ వ్యవహారాల లో...... వైకాపా... పట్టుబిస్తుండటంతో..... తెదేపా క్యాడర్... ఏమిటీ మాకు ఈ కర్మ... అని ఊసూరుమంటోంది.

* ఎమ్మెల్యే తో మున్సిపాలిటీ సమీక్షా సమావేశంలో..... కావలి అభివృద్ధి పై సుదీర్ఘంగా చర్చించారు.

* మున్సిపాలిటీ ఖజానాకు నిధులు సమకూరే మార్గాలు,  అమృత్ పథకం కింద.... నిధులు వస్తే... ఎలా వినియోగించుకోవాలి.... ఏఏ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి.... తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

* అన్ని రాజకీయ పార్టీలు.... మేధావులు.... సీనియర్ సిటిజన్స్... వ్యాపార వర్గాలు.... ఇలా.... పట్టణంలోని ముఖ్యమైన.... అందరితో.... ఒక సమావేశం ఏర్పాటు చేసి..... మున్సిపాలిటీ ద్వారా పట్టణంలో చేయాల్సిన మంచి పనులకు..... బ్లూప్రింట్ తయారు చేయాలని నిర్ణయించారు.

* మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగు పరిచేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిసైడ్ చేశారు.

*  చూద్దాం.... ఏం జరుగుతుందో....

No comments:

Post a Comment